Modi US Visit: UN హెడ్‌క్వార్ట‌ర్స్‌లో యోగా డే సెల‌బ్రేష‌న్స్

America: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (modi us visit) అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈరోజు యోగా దినోత్స‌వం (yoga day) సంద‌ర్భంగా న్యూయార్క్‌లోని యునైటెడ్ నేష‌న్స్ హెడ్ క్వార్టర్స్‌లో సెల‌బ్రేష‌న్స్ జరుగుతున్నాయి. ఈ వేడుక‌లో మోదీ పాల్గొన్నారు. హెడ్‌క్వార్ట‌ర్స్‌లోని నార్త్ లాన్ గార్డెన్స్‌లో ఉన్న మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి మోదీ నివాళులు అర్పించారు. హెడ్ క్వార్ట‌ర్స్‌లోని లాన్ మొత్తంలో యోగా మ్యాట్స్ ప‌రిచి పెట్టారు. ఈ యోగా వేడుక‌లో ప్ర‌ముఖ సింగ‌ర్, గ్రామీ విన్న‌ర్ రిక్కీ కేజ్ కూడా పాల్గొన‌నున్నారు. మోదీతో క‌లిసి యోగా చేయ‌బోతున్నందుకు సంతోషంగా ఉంద‌ని తెలిపారు. హాలీవుడ్ న‌టుడు రిచ‌ర్డ్ గేరే కూడా యోగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు వ‌చ్చారు. యూఎన్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్ర‌వాస భార‌తీయులంతా భార‌త్ మాతా కీ జై అంటూ నినాదాలు చేసారు.