Rajaiah: క‌డియం శ్రీహ‌రిని స‌స్పెండ్ చేయండి

Hyderabad: సీనియర్ BRS లీడర్ కడియం శ్రీహరి మీద తీవ్ర ఆరోపణలు చేసారు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య (rajaiah). కడియం శ్రీహరి (kadiyam srihari) దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్కౌంటర్ల సృష్టికర్త అని షాకింగ్ కామెంట్స్ చేసారు. 2014 నుండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని BRS పార్టీ నుండి సస్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేసారు. ఎన్నిక‌ల‌కి ముందు BRSలో ముస‌లం ఏర్ప‌డ‌టం పార్టీ కేడ‌ర్‌లో టెన్ష‌న్‌కు దారితీస్తోంది. దీనిపై సీఎం KCR ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.