Stalin: NEET క్యాన్సిల్ చేస్తాం.. ఆత్మహత్యలు వద్దు
Chennai: నీట్ (neet) పరీక్షను క్యాన్సిల్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ఎవ్వరూ కూడా ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడకండి అంటూ వెల్డించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin) మరి కొన్ని నెలల్లో రాజకీయంగా మార్పులు జరగబోతున్నాయని, అప్పుడు నీట్ దానంతట అదే క్యాన్సిల్ అయిపోతుందని స్టాలిన్ తెలిపారు. యాంటీ నీట్ బిల్లుపై సంతకం చేయను అని చెప్పిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని (rn ravi) ఉద్దేశిస్తూ స్టాలిన్ ఈ విధంగా మాట్లాడారు. ఇటీవల నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్ధి జగదీశ్వరన్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ నీట్ త్వరలో స్క్రాప్ అయిపోతుంది స్టాలిన్ (stalin) అన్నారు.