EXCLUSIVE: రోజా అనుచ‌రుడి ఓవ‌రాక్ష‌న్

EXCLUSIVE: మంత్రి రోజా (roja) అనుచ‌రుడు ప్ర‌త్యూష్ ఓవ‌రాక్ష‌న్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ పోలీస్ అధికారినే నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతూ బెదిరించాడు. న‌గ‌రిలో విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ని ప‌ట్టుకుని నువ్వు ఇక్క‌డికి వ‌చ్చి బిల్డప్పులు ఇస్తావా? నేనేంటో చూపిస్తా అంటూ నోటికొచ్చిన‌ట్లు వాగాడు. స్థానిక కుశ‌స్థ‌లి ప్రాంతంలో అక్ర‌మంగా ఇసుక ర‌వాణా జ‌రుగుతోంద‌ని కానిస్టేబుల్‌కు స‌మాచారం అందింది. మ‌రో కానిస్టేబుల్‌తో క‌లిసి కుశ‌స్థ‌లి వ‌ద్ద‌కు వెళ్లగా అక్క‌డ ప్ర‌త్యూష్‌తో పాటు మ‌రికొంద‌రు ఉన్నారు. వారిని అడ్డుకునేందుకు య‌త్నించగా ప్ర‌త్యూష్ కానిస్టేబుళ్ల‌ను బెదిరించాడు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రోజాకు ఇదో త‌ల‌నొప్పిగా మారింది. కేవ‌లం రోజా అనుచ‌రుడు కావ‌డం వ‌ల్లే ప్ర‌త్యూష్ ఇలా అంద‌రితో గొడ‌వ‌లు ప‌డుతున్నాడు. ఇలా అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజా గెల‌వ‌డం క‌ష్ట‌మే.