ఇండియాలో పుట్టుంటే నితీష్‌పై పోటీ చేసేదాన్ని.. విదేశీ సింగర్ ఆగ్రహం
Mary millben: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (nitish kumar) సంతానోత్పత్తి అంశంపై నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలు చదువుకుంటే పిల్లల్ని కనకుండా భర్తలను కంట్రోల్ చేయొచ్చని అన్నారు. దాంతో అసెంబ్లీ దద్దరిల్లింది. దాంతో నితీష్ అందరికీ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని అన్నారు.
అయితే కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదని వెంటనే రాజీనామా చేయాలని BJP డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆఫ్రికన్- అమెరికన్ గాయని మేరీ మిల్‌బెన్ (mary millben) నితీష్‌పై మండిపడ్డారు. తానే గనక ఇండియాలో పుట్టి ఉంటే నితీష్‌పై పోటీ చేసి మరీ ఓడించేదాన్నని అన్నారు. మహిళల పట్ల ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేసిన నితీష్‌ను ఓడించాలంటే బిహార్ నుంచి ఓ మహిళ ధైర్యం చేసి ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. బిహార్ మహిళలను ధైర్యంగా తీర్చాలని BJPని కోరారు.
ఎవరీ మేరీ మిల్‌బెన్
ఆఫ్రికన్ – అమెరికన్ గాయని అయిన మేరీ ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) పాదాలకు నమస్కరించి వైరల్‌గా మారింది. తనకు ఇండియా అన్నా ప్రధాని మోదీ అన్నా ఎనలేని గౌరవం అని అందుకే తాను మోదీకి సపోర్ట్ చేస్తున్నానని తెలిపింది. ఇండియాకు ఆయనే బెస్ట్ లీడర్ అని ఆయన నాయకత్వంలోనే భారతీయుడు అభివృద్ధి చెందుతారని తెలిపింది. మోదీ మహిళల తరఫు పోరాడే నేత అని కొనియాడారు.