Bandi Sanjay: KCR ట‌చ్‌లో కాంగ్రెస్ నేత‌లు..ఏమైనా జ‌ర‌గొచ్చు

Bandi Sanjay: లోక్ స‌భ ఎన్నిక‌లు (lok sabha elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఎంద‌రో కాంగ్రెస్ నేత‌లు తెలంగాణ మాజీ సీఎం KCRకు ట‌చ్‌లో ఉన్నార‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు BJP నేత బండి సంజ‌య్. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత KCR ఏదైనా చేసే అవ‌కాశం ఉంద‌ని ఎందుకంటే కాంగ్రెస్‌లో KCR కోవ‌ర్టులు చాలా మంది ఉన్నార‌ని బండి అభిప్రాయ‌ప‌డ్డారు. ఆల్రెడీ బేర‌సారాలు మొద‌ల‌య్యాయ‌ని.. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చాలా మంది నేత‌ల‌కు KCR డ‌బ్బులు ఇచ్చార‌ని తాను చాలా సార్లు చెప్పాన‌ని.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ఏమైనా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.