Etela Rajender: నేనెప్పుడు వెళ్లిపోతానా అని చూస్తున్నారు

Hyderabad: మా పార్టీలోనే నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని కొందరు ఎదురుచూస్తున్నారు అని అంటున్నారు BJP నేత ఈటెల రాజేంద‌ర్ (etela rajender). త‌నను వెళ్లిపో అంటూ అవ‌మానించే వాళ్లు ఉన్నార‌ని, అది వాళ్ల ఖర్మ‌కే వ‌దిలేస్తున్నాన‌ని అన్నారు. వాళ్లెవ‌రో కూడా ప్ర‌జ‌ల‌కు తెలుసు అని తెలిపారు. కొంత‌కాలంగా BJP పార్టీకి సంబంధించిన మీటింగుల‌కు వెళ్ల‌కుండా ఈటెల (etela rajender) ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. ఇందుకు కార‌ణం ఆయ‌నకు BJP తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని కొంద‌రి వాద‌న‌. మ‌రోప‌క్క ఆయ‌న‌కు అడ్మిష‌న్స్ క‌మిటీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారంటూ అలాంటి క‌మిటీ అస‌లు ప్రపంచంలోనే లేద‌ని ఈటెల (etela rajender) వాపోయారు.