Manchu Lakshmi: BJPలోకి మోహ‌న్ బాబు కూతురు?

మంచు మోహ‌న్ బాబు కూతురు, న‌టి మంచు ల‌క్ష్మి (manchu lakshmi) BJPలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. రేపు ఎంపీ కిష‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఆమె అధికారికంగా పార్టీలో చేర‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మంచు మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం అటు YSRCPకి ఇటు TDPకి స‌పోర్ట్ చేస్తున్నారు. విష్ణు YSRCPకి స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక మంచు మ‌నోజ్‌.. జ‌న‌సేన‌, TDPకి స‌పోర్ట్‌గా ఉన్నారు. ఆయ‌న కూడా త్వ‌ర‌లో తెలుగు దేశం పార్టీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.