Odisha Train Accident: ఏదో దాస్తున్నారు.. నిజం బయటపడాలి
Odisha: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (odisha train accident) విషయంలో కేంద్రం ఏదో దాస్తోందని అన్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee). శనివారం మమత ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లారు. ఆ సమయంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (ashwini vaishnaw) కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు మమత అశ్వినితో పాటు పలువురు BJP మంత్రుల పక్కన నిలబడి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేసారు.
“నిన్న రైల్వే మంత్రి అశ్విని, రవాణా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నా పక్కనే నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదానికి గురైన రైళ్లలో యాంటీ కొలిషన్ పరికరం ఎందుకు లేదు అని ప్రశ్నించాను. అప్పుడు వారు నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డారు. నాకేదో అనుమానంగా ఉంది. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో (odisha train accident) అసలు ఏం జరిగిందో నిజం బయటికి రావాలి. చరిత్రను మార్చి రాయాలని అనుకునేవారు ఏ నెంబర్‌నైనా సులువగా మార్చగలరు. ప్రజల పక్షాన ఉండాల్సిందిపోయి నన్ను తిడుతున్నారు. నితీష్ జీ, లాలూజీ.. 2002లో కదులుతున్న గోద్రా రైలులో అగ్ని ప్రమాదం ఎలా చోటుచేసుకుంది? ఆ సమయంలో చాలా మంది చనిపోయారు. కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు”
“ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (coromandel express) బెస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి. నేను రైల్వే శాఖ మంత్రిగా మూడు సార్లు పనిచేసాను. నేను చూసిన వాటిలో 21వ శతాబ్దంలో అతిపెద్ద రైలు ప్రమాద ఘటన ఇదే. ఇలాంటి కేసులు రైల్వే సేఫ్టీ కమిషన్‌కు ఇస్తారు. వారు విచారణ చేపట్టి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. నాకు తెలిసి రైళ్లలో యాంటీ కోలిషన్ పరికరం పెట్టి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు” అంటూ BJP మంత్రుల ముందే తీవ్ర విమర్శలు చేసారు మమత.