Odisha Train Accident: నిజం తెలియాల్సిందే.. CBIని అడ్డం పెట్టుకోకండి
Odisha: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై (odisha train accident) నిజం బయటకు రావాల్సిందేనని డిమాండ్ చేసారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee). కేసు విచారణను CBIకి అప్పగించి BJP తన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని అన్నారు. వందల కుటుంబాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత BJPదేనని అన్నారు.
“కేసును CBIకి అప్పగిస్తే జరిగేది ఏమీ లేదని ఆరోపించారు. కేసును CBIకి ఎలా ఇస్తారు. CBI ఉన్నది క్రిమినల్ కేసులు డీల్ చేయడానికి. రైలు ప్రమాదానికి సీబీఐకి సంబంధం ఏంటి? పుల్వామా ఘటనపై సీబీఐ ఏం చేసిందో చూసారు కదా? నిజానికి సీబీఐ ఎలాంటి విచారణ జరపడంలేదు. ఇదంతా BJP కవరింగ్. 21వ శతాబ్దంలో చోటుచేసుకున్న అతిపెద్ద ప్రమాదం ఇది. అసలు ఎలా జరిగింది? ఎందుకు అంత మంది చనిపోయారు? నిజాలు బయటికి రావాల్సిందే. బీజేపీ సీబీఐని అడ్డుపెట్టుకుంటోంది. దిల్లీ నుంచి పలువురు సీబీఐ అధికారులను బెంగాల్ పంపించారు. ఇక్కడి 14 మున్సిపాలిటీల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన రైల్వే శాఖను మాత్రం విచారించడంలేదు. అర్బన్ డెవలప్‌మెంట్‌లోకి కూడా ప్రవేశించారు. రేపు బాత్రూమ్‌లలోకి కూడా వచ్చేస్తారా?” అని ప్రశ్నించారు.
అని ప్రశ్నించారు. మరోపక్క BJP మమతాపై ఆరోపణలు చేసింది. బెంగాల్‌కు చెందిన మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసారని కాకపోతే ఆ ఫండ్స్ అన్నీ బిల్డింగులు, ఇతర కన్‌స్ట్రక్షన్ వర్కర్ల వెల్ఫేర్ బోర్డువని (BOCWWB) ఆరోపిస్తున్నారు. వారి ఫండ్స్‌ని లాక్కుని మృతుల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారని BJP నేత సువేందు అధికారి ఆరోపించారు.