Mamata Banerjee: అమిత్ షా నిజమే చెప్పారు
Delhi: కేంద్రం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును (delhi ordinance bill) లోక్‌సభలో ఆమోదం తెలిపారు. ఈ బిల్లుని ఎందుకు పాస్ చేయాలో కేంద్రమంత్రి అమిత్ షా (amit shah) పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) కామెంట్ చేసారు. ఢిల్లీ బిల్లుకు ఆమోదం తెలిపాలని ఇతర పార్టీల సభ్యలను అమిత్ షా కోరుతూ ఇలా అన్నారు..
“”అపోజిషన్ కూటమి కేవలం ఎన్నికల గురించే కాకుండా కాస్త దేశ రాజధాని ఢిల్లీ బాగు కోసం కూడా ఆలోచించాలి. మీ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉందన్న ఒక్క కారణంతో వారికి సపోర్ట్ చేయకండి. మీరు కూటమి ఏర్పాటుచేసుకున్నా కూడా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది మోదీనే. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా AAPకు సపోర్ట్ చేస్తారు? “” అని అమిత్ షా ప్రశ్నించారు. దీనికి మమతా బెనర్జీ సమాధానమిస్తూ.. “” ఒకటి మాత్రం నిజం. మా కూటమి కొత్తదే. దేశవ్యాప్తంగా కూటమిలోని పార్టీలు విస్తరించి ఉన్నాయి. ఢిల్లీలో మా పార్లమెంట్ ఉంది. కాబట్టి ఢిల్లీని కాపాడాల్సిన అవసరం ఉంది. మాకు ఉన్న విలువ NDAకు లేదు. ఇండియాను కాపాడుకోవడానికి మా ఇండియా (I-N-D-I-A) గెలిచి తీరుతుంది “” అన్నారు.