Mamata Banerjee: రాజీనామాకు సిద్ధం.. దీదీ సంచలనం
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామాకు అంగీకరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసారు. కలకత్తా హత్యాచార ఘటనపై యావత్ వెస్ట్ బెంగాల్‌కు చెందిన జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం జరగుతుందని.. జూనియర్ డాక్టర్లు తిరిగి విధుల్లో చేరితే మంచిదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా వారు వినిపించుకోలేదు. జూనియర్ డాక్టర్లతో మమతా బెనర్జీ చర్చించాలని అనుకున్నారు. కానీ వారంతా ఈ సంభాషణ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. అది దీదీకి నచ్చలేదు. మీటింగ్‌కి జూనియర్ డాక్టర్లు వస్తారేమో అని ఆమె రెండు గంటల పాటు వేచి చూసారు. కానీ ఒక్కరు కూడా రాలేదు.
దాంతో తాను ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. కానీ జూనియర్ వైద్యుల నిరసనల్లో రాజకీయ కుట్ర ఉందని.. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొందరు నేతలు సీఎం సీటు కోసమే కొట్టుకుంటున్నారు తప్ప బాధితురాలికి న్యాయం చేసేందుకు కాదని ఆమె ఆరోపించారు.