అనారోగ్యంతో ఖర్గే.. మోదీని గద్దె దించే వరకు చావను
Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రసంగం మధ్యలో అనారోగ్యానికి గురయ్యారు. కళ్లు తిరిగి పడిపోతుండగా వెనకే ఉన్నవారు ఆయన్ను పట్టుకున్నారు. అరగంట సేపు రెస్ట్ తీసుకున్నాక మళ్లీ ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి రావాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఖర్గే శ్రీనగర్‌లో ప్రసంగించారు.
ప్రసంగం మధ్యలోనే ఖర్గే అనారోగ్యానికి గురై కళ్లు తిరిగి పడబోయారు. ఆయన్ను వెంటనే రెస్ట్ రూంకి తరలించారు. అరగంట తర్వాత మళ్లీ ప్రసంగం మొదలుపెడతానని అనడంతో వద్దు సర్ రెస్ట్ తీసుకోండి అని వైద్యులు చెప్పారు. అయినా ఖర్గే వినలేదు. తనను ఇద్దరు మనుషులు వెనక నుంచి పట్టుకోవాలని… తాను ప్రసంగిస్తానని అన్నారు. దాంతో అక్కడున్నవారు షాకయ్యారు. ఆయన ప్రసంగం మొదలుపెడుతూ నరేంద్ర మోదీని గద్దె దించే వరకు నేను చావను అని ఆయన అనడం వైరల్‌గా మారింది.
“” జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించేంత వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. నాకు 85 ఏళ్లు. నేను అప్పుడే చావను. మోదీని గద్దె దించాకే నా చావు. జమ్మూ కాశ్మీర్‌లో 45 ఏళ్లుగా యువతకు ఉద్యోగాలే లేవు. ఏమీ చేయకపోగా ఎన్నికలు రాగానే మోదీ మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లో 65 శాతం ఉద్యోగాలను బయటి వాళ్లు ఇచ్చేసాడు మోదీ. మీకు మాత్రం రోజూ కూలీ చేసుకునే పరిస్థితి వచ్చింది “” అంటూ ఖర్గే రెచ్చిపోయారు.