Mallikarjun Kharge: ఎక్కువ కాలం బత‌కాల‌ని లేదు

Mallikarjun Kharge says he does not want to live for longer

Mallikarjun Kharge:  త‌న‌కు ఎక్కువ కాలం బ‌త‌కాల‌ని లేద‌ని రాజ్య‌స‌భ‌లో వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖ‌ర్గే. రాజ్య‌స‌భ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో భార‌తీయ జన‌తా పార్టీకి చెందిన ఎంపీ ఘ‌న్‌శ్యాం తివారీ ఖ‌ర్గేపై కామెంట్ చేసారు. ఖ‌ర్గే మొత్తం ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంద‌ని అన్నారు. దాంతో ఖ‌ర్గే ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఆ వ్యాఖ్య‌ల‌ను రాజ్య‌స‌భ రికార్డుల నుంచి తొల‌గించాల‌ని కోరారు.

త‌న ఫ్యామిలీలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు ఎవ‌రైనా ఉన్నారంటే అది కేవ‌లం తాను మాత్ర‌మే అని త‌న తండ్రి 85 ఏళ్ల వ‌య‌సులోనే చ‌నిపోయార‌ని అన్నారు. అది విన్న రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ మీరు మాత్రం మ‌రింత ఎక్కువ కాలం బ‌తికుండాలి ఖ‌ర్గేజీ అన్నారు. దానికి ఖ‌ర్గే స‌మాధానం ఇస్తూ.. ఇలాంటి రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య తాను ఎక్కువ కాలం బ‌త‌కాల‌ని కూడా కోరుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించ‌డంతో స‌భ మొత్తం సైలెంట్‌గా మారిపోయింది.