Mallikarjun Kharge: రూ.100 కోట్ల దావా.. BJP ప్లానా?!
Bengaluru: పంజాబ్ కోర్టు(punjab) కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గేకు(mallikarjun kharge) సమన్లు జారీ చేసింది. కర్ణాటక ఎన్నికల్లో (karnataka elections) గెలిచిన కాంగ్రెస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని చూస్తున్న BJPకి అవకాశం దక్కినట్లుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రవేశపెట్టినప్పుడు భజరంగ్ దళ్(bajrang dal), PFIను ఉగ్రవాద సంస్థలతో పోల్చడంతో భజరంగ్ దళ్ హిందుస్థాన్ అధ్యక్షుడు హితేష్ భరద్వాజ్ పంజాబ్ కోర్టులో దావా వేసాడు. తమను అగౌరవపరిచినందుకు రూ.100 కోట్లు చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్, పీఎఫ్ఐని బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెసే గెలిచింది కాబట్టి ఎక్కడ బ్యాన్ చేస్తారో అని భయపడి ఈ దావాలు వేసినట్లు తెలుస్తోంది.
దాంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు.. తమ సంస్థను ఎలా బ్యాన్ చేస్తాయో మేమూ చూస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాయి. అయితే భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయబోమని తర్వాత కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. అలాంటి సంస్థలను బ్యాన్ చేయడం కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తుందని, తమకు ఎలాంటి అధికారం ఉండదని తెలిపింది. అయితే హనుమంతుడితో భజరంగ్ దళ్‌ను పోల్చడం నేరమని, అందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారీ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పుడు రూ.100 కోట్ల దావాపై కాంగ్రెస్, ఖర్గే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.