Malla Reddy: TDPలోకి మ‌ల్లారెడ్డి?

malla reddy to join tdp

Malla Reddy: BRS ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈరోజు తెలుగు దేశం పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని మల్లా రెడ్డి, ఆయ‌న అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డిలు క‌లిసారు. త్వ‌ర‌లో తీగ‌ల కృష్ణారెడ్డి తెలుగు దేశం పార్టీలో చేర‌నున్న‌ట్లు ఆల్రెడీ ప్ర‌క‌టించేసారు. అయితే ఆయ‌న‌తో పాటు మ‌ల్లా రెడ్డి కూడా తెలుగు దేశంలోకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌ల్లారెడ్డి త‌న మ‌న‌వ‌రాలి పెళ్లికి చంద్ర‌బాబుని ఆహ్వానించేందుకు వెళ్లారు. అయితే.. ఇదే స‌మ‌యంలో త‌న‌ను తెలుగు దేశం పార్టీలో చేర్చుకోండి అని చ‌ర్చించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. BRSలో ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న కాలేజీలు, స్థలాల‌ను కూల్చేసే అవ‌కాశం ఉంద‌ని BRSకు రాజీనామా చేయాల‌ని మ‌ల్లారెడ్డి నిర్ణ‌యించుకున్నార‌ట‌. కానీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు రేవంత్‌తో పాటు ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు ఒప్పుకోలేద‌ట‌. దాంతో రేవంత్‌కు గురువైన చంద్ర‌బాబు నాయుడు ద్వారా కాంగ్రెస్‌లోకి జంప్ అవ్వాల‌ని మ‌ల్లారెడ్డి ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది.