Malla Reddy: వ‌చ్చేది కారు.. ఏలేది సారు.. అత‌నే మ‌న కేసీఆర్‌..!

BRS నేత మ‌ల్లారెడ్డి (malla reddy) పంచ్‌లు.. ఫ‌న్నీ ప్ర‌సంగాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఏద‌న్నా స్పీచ్ ఇస్తున్నాడంటేనే ప్ర‌జ‌ల్లో ఊపు వ‌స్తుంది. బోర్ కొట్టే విధంగా కాకుండా త‌న‌దైన శైలిలో పంచ్‌లు ప్రాస‌లు వాడుతుంటారు. తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో భార‌త రాష్ట్ర స‌మితి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు ఏర్పాటుచేస్తోంది.

ఈరోజు మేడ్చ‌ల్‌లో (medchal) ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో మ‌ల్లారెడ్డి, సీఎం KCR పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ల్లారెడ్డి ప్ర‌సంగం మొద‌లుపెట్టారు. KCR చేసిన మంచి ప‌నుల గురించి వివ‌రిస్తూ.. స‌ర‌దాగా ఒక పంచ్ విసిరారు. రానున్న ఎన్నిక‌ల్లో వ‌చ్చేది కారు.. గెలిచేది సారు.. అత‌నే మ‌న కేసీఆరు అన్నారు. ఆ మాట విన‌గానే ప‌క్క‌నే ఉన్న KCR కూడా కంట్రోల్ చేసుకోలేక న‌వ్వుకున్నారు.