Pawan Kalyan: ప‌వ‌న్ కాన్వాయ్‌కు త‌ప్పిన ప్ర‌మాదం

major mishap averted to pawan kalyan convoy

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాన్వాయ్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న కాన్వాయ్‌లోని ఒక కారు బోల్తా ప‌డింది. అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట పుల్ల‌ప‌త్తూరులో ప‌ర్య‌ట‌న ముగించుకుని వెళ్తుండ‌గా కాన్వాయ్‌లోని ఓ వాహ‌నం అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఆ స‌మ‌యంలో ఓ వృద్ధుడు వాహ‌నానికి అడ్డు వ‌చ్చాడ‌ని.. దాంతో పోలీస్ వాహ‌నం అదుపు త‌ప్పి పల్టీ కొట్టింద‌ని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌వ‌న్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.