Viveka Case: త‌ల్లికి గుండెపోటు.. CBI విచారణకు డుమ్మా..!

AP: వివేకా హత్య(viveka case) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి(avinash reddy) ఇవాళ CBI కార్యాలయానికి రావాలని అధికారులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పులివెందుల నుంచి అవినాష్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో అవినాష్ తల్లి పులివెందులలో అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చిందని, ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. దాంతో తాను పులివెందుల వెళ్తున్నానని, విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఇక సీబీఐ అధికారుల దగ్గర అనుమతి తీసుకున్నారో లేదు ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఒకవేళ సీబీఐకి చెప్పకుండా వెళ్తే అవినాష్ పై చర్యలు తీసుకునే అవకాశం వుంది.

ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కి ఇవ్వాలని సుప్రీంకోర్టును అవినాష్ ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు మూడుసార్లు అవినాష్ ను వికహరించారు సీబీఐ అధికారులు. ఇవాళ నాలుగోసారి విచారణకు సీబీఐ ఆయన్ని పిలవగానే హాజరుకాకుండా పులివెందుల వెళ్లిపోయారు. దీనిపై సీబీఐ ఏవిధంగా స్పందిస్తుందో చూడాల్సి వుంది.