Mahua Moitra: BJP వల్ల నా ఇల్లు, గర్భసంచిని కోల్పోయా
Mahua Moitra: గత పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో షాకింగ్ కామెంట్స్ చేసారు. భారతీయ జనతా పార్టీ వల్ల తన ప్రభుత్వ బంగ్లాతో పాటు తన గర్భసంచిని కూడా కోల్పోయానని అన్నారు. “” ఈ భారతీయ జనతా పార్టీ వల్ల నేను నా ప్రభుత్వ బంగ్లాను కోల్పోయాను. నా గర్భసంచిని కూడా కోల్పోయాను. వారు నాకు పెట్టిన టార్చర్ వల్ల నాకు హిస్టరెక్టోమీ అనే సర్జరీ చేసారు. ఆ సర్జరీ వల్ల నా గర్భసంచిని తొలగించారు. దీనికి కారణం భారతీయ జనతా పార్టీనే. ఈ విషయంలో ఎలాంటి దాపరికం లేదు. నిర్భయంగా చెప్పగలను. కానీ ప్రజలు మరోసారి నన్ను గెలిపించి నా తప్పు లేదని నిరూపించారు. ఇన్ని బాధలు పడిన నాకు ఇప్పుడు భయం లేదు. నేను ఎవ్వరికీ భయపడను. భారతీయ జనతా పార్టీ అంతు చూసే వరకు వదిలిపెట్టను “” అని పార్లమెంట్‌లో మహువా రెచ్చిపోయారు.