Mahua Moitra: ఇంత ఎన‌ర్జీ సెక్స్ వ‌ల్లే వ‌స్తోంది.. బెంగాల్ నేత షాకింగ్ వ్యాఖ్య‌లు

Mahua Moitra: వెస్ట్ బెంగాల్‌కి చెందిన తృణ‌మూల్ కాంగ్రెస్ నేత మ‌హువా మోయిత్రా షాకింగ్ వ్యాఖ్య‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌హువా కృష్ణాన‌గ‌ర్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. రోజూ ఉద‌యాన్నే ఆమె చురుగ్గా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న నేప‌థ్యంలో ఓ విలేక‌రి మీకు ఇంత ఎన‌ర్జీ ఎక్క‌డి నుంచి వ‌స్తుంది మేడ‌మ్ అని అడిగాడు. ఇందుకు మ‌హువా స్పందిస్తూ.. సెక్స్ వ‌ల్లే అని చెప్పారు. అయితే ఆమె సెక్స్ అనే ప‌దం వాడ‌లేద‌ని.. ఎగ్స్ అన్నార‌ని.. కావాల‌ని వైర‌ల్ చేసేందుకు నాలుగు లైక్స్, కామెంట్స్ కోసం ఇలాంటి త‌ప్పుడు వీడియోలు సృష్టిస్తున్నార‌ని ఓ నెటిజ‌న్ క్లారిటీ ఇచ్చారు.

READ MORE: https://telugu.newsx.com/tag/mahua-moitra/