Mahasena Rajesh: పొత్తు నుంచి జ‌న‌సేన‌ను స‌స్పెండ్ చేయాలి

Mahasena Rajesh demands suspension of janasena from alliance

Mahasena Rajesh:  తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీలు పొత్తు నుంచి జ‌న‌సేన‌ను స‌స్పెండ్ చేయాల‌ని అంటున్నారు మ‌హాసేన రాజేష్‌. ఆయ‌న గ‌తంలో తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌నుకున్నారు. టికెట్ ఇచ్చారు కానీ తెలుగు దేశం వారు కానీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కానీ త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంలేద‌ని.. క‌నీసం కూట‌మి పెద్ద‌లు పిలిచి న‌చ్చజెప్ప‌డం లేద‌ని ఆయ‌న జ‌న‌సేన నుంచి బ‌య‌టికి వ‌చ్చేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం క‌న్నా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌పోర్ట్ చేయ‌డం బెట‌ర్ అని మీడియా ముందు ఓవ‌రాక్ష‌న్ చేసాడు.

ఎన్నిక‌ల్లో కూట‌మి గెలిచిన నేప‌థ్యంలో మ‌హాసేన రాజేష్‌ను స‌స్పెండ్ చేయాల‌ని తెలుగు దేశం పార్టీ నిర్ణ‌యించింది. దాంతో ఆయ‌న రోడ్డుపై బైఠాయించి ధ‌ర్నాకు దిగారు. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా తెలుగు దేశం, జ‌న‌సేన కోసం ప్రాణాల‌కు తెగించి పోరాడామ‌ని.. ఎన్ని మాట‌ల‌న్నా ఎన్ని కేసులు పెట్టినా భ‌రించామ‌ని తెలిపారు. ఒక‌వేళ త‌న‌ను స‌స్పెండ్ చేయాల‌నుకుంటే ముందు జ‌న‌సేన‌ను పొత్తు నుంచి తొల‌గించి ఆ త‌ర్వాత త‌న‌ను స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.