Madhavi Latha: రోజాతో పాటు ఉన్న ఆ వ్య‌క్తి ఎవ‌రు బండారు?

YSRCP మంత్రి రోజాపై.. (roja) TDP మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణమూర్తి (bandaru satyanarayana murthy) చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల స్పందించారు BJP మాజీ నేత‌, న‌టి మాధ‌వీల‌త‌ (madhavi latha). తాను ఏ పార్టీకి ఏ నేత‌కూ స‌పోర్ట్ చేయ‌డంలేద‌ని.. రోజా అంటే త‌న‌కు అభిమానం ఉన్న‌ప్ప‌టికీ గ‌తంలో ఆమె ఇతర నేత‌ల ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి బ‌య‌ట ద‌రిద్రంగా మాట్లాడ‌టం వ‌ల్లే ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు త‌న గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నార‌ని అన్నారు.

“” రోజా గారూ.. మీరంటే నాకెంతో గౌర‌వం. మ‌హిళ‌లు రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోలేరు. కానీ మీరు పోరాడి ఇప్పుడు మంత్రి ప‌ద‌విలో ఉన్నారు. గ‌తంలో మీరు ఇత‌ర నేత‌ల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి మాట్లాడారు. అవి మీకు ఇప్పుడు త‌గులుతున్నాయి. కాబ‌ట్టి నేను ఎవ్వ‌రికీ స‌పోర్ట్ చేయాల‌ని అనుకోవ‌డంలేదు. బండారు స‌త్య‌నారాయ‌ణ గారూ.. రోజా మీ పార్టీలో చేర‌క‌ముందే ఎవ‌రితోనో లాడ్జిలో ఉన్న‌ప్పుడు చూసాం అని అన్నారు క‌దా. మ‌రి ఆ వ్య‌క్తి ఎవ‌రో కూడా చెప్పాలి క‌దా. సాక్ష్యాలు ఉంటే చూపించాలి క‌దా. రోజా త‌ప్పుడు మ‌నిషి అని తెలిసిన‌ప్పుడు ఎందుకు ఆమెను పార్టీలో చేర్చుకున్నారు? అప్పుడు ఆమె మీ పార్టీలో ఉన్నారు కాబ‌ట్టి మీరు ఏమీ అన‌లేదు. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉన్నారు కాబ‌ట్టి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేస్తున్నారు. ద‌య‌చేసి మ‌హిళా నేత‌లైనా మ‌గ నేత‌లైనా ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకోండి కానీ ప‌ర్స‌న‌ల్ జీవితాల గురించి.. ఇంట్లోవారి గురించి నోటికొచ్చిన‌ట్లు వాగ‌కండి“” అంటూ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు మాధ‌వీల‌త‌. (madhavi latha)