Madhavi latha: గెలిస్తే కేంద్ర మంత్రి.. ఓడిపోతే గ‌వ‌ర్న‌ర్..!

 

madhavilatha gets a bumper offer from bjp

Madhavi Latha: హైద‌రాబాద్ ఎంపీగా భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) విరించి హాస్పిట‌ల్స్ అధినేత్రి మాధ‌విల‌త‌ను బ‌రిలోకి దించిన సంగ‌తి తెలిసిందే. అయితే మాధ‌విల‌త‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ బంపర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎంపీగా అస‌దుద్దిన్ ఒవైసీపై మాధ‌విల‌త గెలిస్తే ఆమెకు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నుంద‌ట‌. ఓడిపోతే ఏ రాష్ట్రానికైనా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

హైద‌రాబాద్ ఎన్నో ఏళ్లుగా AIMIM అధినేత అస‌దుద్దిన్ ఒవైసీ కంచుకోటగా ఉంది. అస‌ద్‌కి ముందు అత‌ని తండ్రి స‌లావుద్దిన్ ఒవైసీ ఆరు సార్లు గెలిచారు. దాంతో ఈసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌హిళా నేత‌ను బ‌రిలోకి దింపితే ఎలా ఉంటుందో ప‌రిశీలించాల‌ని అనుకుంటోంది.