DCP Sandeep: TDP నేతల మీటింగ్, ర్యాలీలకు అనుమతి లేదు

IT ఉద్యోగులు, TDP నేతల మీటింగ్, ర్యాలీలకు అనుమతి లేదని స్ప‌ష్టం చేసారు మాదాపూర్ DCP సందీప్ (dcp sandeep). నిరసనలు తెలుపుతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తప్పవ‌ని హెచ్చ‌రించారు. TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ (chandrababu naidu arrest) అయిన నేప‌థ్యంలో సైబ‌ర్ ట‌వ‌ర్స్ వ‌ద్ద ఐటీ ఉద్యోగులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసారు. ఈరోజు హైటెక్ సిటీ ఈ స్థాయిలో ఉందంటే అందుకు కార‌ణం ఆయ‌నే అని అలాంటి చంద్ర‌బాబు కోసం కాక‌పోతే ఇంకెవ‌రికి స‌పోర్ట్ చేయాల‌ని అన్నారు. ధర్నాలు, నిర‌స‌న‌లు మితిమీర‌క ముందే తెలంగాణ పోలీసులు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.