Sajjala: స‌జ్జ‌ల‌పై లుకౌట్ నోటీసులు.. అడ్డ‌గించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు

look out notice on sajjala ramakrishna reddy

 

Sajjala: వైఎస్సార్ కాంగ్రెస్ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసారు. విదేశాల నుంచి తిరిగి ఢిల్లీ వ‌చ్చిన స‌జ్జ‌ల వేరే విమానంలో హైద‌రాబాద్‌కు రావాల్సి ఉంది. కానీ ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు ఉన్నాయంటూ ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ఆయ‌న్ను ప‌ట్టుకున్నారు. దీనిపై స‌జ్జ‌ల మండిప‌డ్డారు. అస‌లు త‌న‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యార‌న్న విష‌యం కూడా త‌న‌కు తెలీద‌ని.. నోటీసులు కూడా రాలేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.