Telangana Elections: మంథని గతేంటని?
ఎన్నికలు దగ్గరపడుతున్న (telangana elections) నేపథ్యంలో మంథని (manthani) ప్రాంత ప్రజల పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవాలి. తెలంగాణలోని ఉత్తర ప్రాంతాలకు సాగు, తాగు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ (kaleswaram project) చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరి జలాలను తెలంగాణ ఉత్తర ప్రాంతాలకు చేరేలా ప్లాన్ చేసారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మంది రైతులు లాభపడ్డారు కానీ.. మంథనిలోని ఆరెండ, మల్లారం గ్రామ రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు ముంపులో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం తీసుకున్న భూములకు గానూ రైతులకు పరిహారం కూడా చెల్లించింది. కానీ ఈ గ్రామాల్లో నీరు నిలిచిపోకుండా.. పొలాలు మునిగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని నిర్మాణాలను చేపట్టినప్పటికీ అవి పనికిరాకుండాపోయాయి అక్కడి గ్రామస్థులు చెప్తున్నారు. (telangana elections)
ఈ నిర్మాణాల వల్ల సమస్య తీరకపోగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరిగ్గా సర్వే చేయించకుండా నిర్మాణాలు చేపట్టిందని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మంథని ప్రజల అభిప్రాయం ఇప్పటికీ మారలేదు. వారికి అధికార ప్రభుత్వంపై వారు చేపట్టిన అభివృద్ధి పనులు, అందించిన పథకాలపై సుముఖంగానే ఉన్నారు. అలాగని అందరి అభిప్రాయం అలాగే ఉందని చెప్పలేం. కొందరు మాత్రం మంథని సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, అతని తండ్రి అవినీతి పరులు అని చెప్తున్నారు. వారికి ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికే ఓట్లు వేస్తామని ఓపెన్‌గా చెప్తున్నారు. (telangana elections)