AP Elections: వీడిన సస్పెన్స్.. చింతమనేనికి చంద్రబాబు ఫోన్
AP Elections: తెలుగు దేశం పార్టీ దెందులూరు సీటుపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఈ సీటు చింతమనేని ప్రభాకర్‌కే (Chintamaneni Prabhakar) దక్కింది. ఆనపర్తి సీటుపై క్లారిటీ రావడంతో చింతమనేని ప్రభాకర్‌కు దెందులూరు సీటు కన్ఫామ్ అయ్యింది. దాంతో చంద్రబాబు నాయుడు చింతమనేనికి కాల్ చేసి మాట్లాడారు. బీఫాం తీసుకోవడానికి శ్రీకాకుళం రావాలని పిలుపునిచ్చారు. నిన్న రాత్రి ఆనపర్తి తెలుగు దేశం పార్టీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడంతో దెందులూరు అభ్యర్ధి విషయంలో సస్పెన్స్ వీడినట్లయ్యింది.
ALSO READ:
Jagan: నోరు జారితే చూస్తూ ఊరుకోం.. ఎన్నికల కమిషన్ హెచ్చరిక