Telangana Elections: ఎవరు ఎవరి వైపు.. ఓ లుక్కేద్దామా?
Telangana Elections: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తైపోయింది. ఇక బరిలో నిలిచే పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఎవరు ఎవరితో పొత్తులో ఉన్నారు.. ఎవరెవరు కలిసి బరిలోకి దిగనున్నారు వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం.
TJS – కాంగ్రెస్
తెలంగాణ జన సమితి (TJS) కాంగ్రెస్ (congress) పార్టీ వైపు నిలబడింది. ఈసారి కాంగ్రెసే ప్రభుత్వాన్ని నెలకొల్పాలని తెలంగాణ జన సమితి నేతలు అంటున్నారు. వారు కూడా కాంగ్రెస్ తరఫునే ప్రచారం చేస్తున్నారు.
YSRTP – కాంగ్రెస్
వైఎస్ షర్మిళ (ys sharmila) పార్టీ అయిన YSRTP కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వాలని అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని కూడా షర్మిళ ప్రకటించింది. కానీ ఎప్పుడైతే పాలేరు సీటు నుంచి కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) పోటీ చేయనున్నట్లు ప్రకటించారో షర్మిళ ఆశలు అడియాశలయ్యాయి. ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కడ ఓట్లు చీలి మళ్లీ కేసీఆరే సీఎం అవుతారోనని భావించి తాను ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. (telangana elections)
TDP – కాంగ్రెస్
ఇక తెలుగు దేశం పార్టీ (TDP) తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) జైలు పాలవ్వడం… పార్టీ కష్టాల్లో ఉండటంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదని అనుకున్నారు. అయితే తాము పోటీ చేయలేకపోయినప్పటికీ కాంగ్రెస్‌కి సపోర్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
CPI – కాంగ్రెస్
ఇక CPI పార్టీ కూడా కాంగ్రెస్‌తో పొత్తును ప్రకటించింది. CPI (M) కూడా ప్రకటించింది కానీ అడిగిన సీట్లు ఇవ్వలేదన్న కోపంతో పొత్తు విరమించుకుంది. ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.
BJP – జనసేన
ఎవ్వరూ ఊహించని రీతిలో జనసేన (janasena) పార్టీ BJPతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం కొందరికి నచ్చలేదు. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో BJP సీటును జనసేనకు ఇవ్వడం ఆ పార్టీ కార్యకర్తలకు నచ్చక రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేన BJP కలిసే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. (telangana elections)
AIMIM – BRS
BRS పార్టీ ఇప్పటివరకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఇక ముందు కూడా పొత్తులకుపోయే ఆలోచన లేదని ఆ పార్టీ నేత KTR ప్రకటించారు. అయితే BRS, AIMIM పార్టీల మధ్య ఎప్పటినుంచో మంచి దోస్తీ ఉంది. ఇప్పుడు కూడా AIMIM BRSకే సపోర్ట్ చేస్తోంది. AIMIM పోటీ చేస్తున్న చోట తమకు ఓటు వేయాలని.. చేయని చోట BRSకు ఓటు వేయాలని ఇప్పటికే పార్టీ అధినేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీలు బహిరంగంగానే ప్రకటించారు. (telangana elections)