Taraka Ratna భార్య‌కి టీడీపీ ఎమ్మెల్యే టికెట్!?

Hyderabad: దివంగ‌త న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న(taraka ratna) భార్య అలేఖ్యా రెడ్డి(alekhya reddy) తెలుగు దేశం పార్టీ(tdp) నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న‌ట్లు వార్తలు వెలువ‌డుతున్నాయి. త్వ‌ర‌లో టీడీపీలో ఎమ్మెల్యేగా చేరి ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నేది తార‌క‌ర‌త్న చివ‌రి కోరిక‌ట‌. త్వ‌ర‌లో ఆ కోరిక తీర‌నుంది అనుకుంటుండ‌గానే ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దాంతో త‌న భ‌ర్త ఆశ‌పడింది అలేఖ్య నెర‌వేర్చాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై అలేఖ నుంచి టీడీపీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. తార‌క‌ర‌త్న పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు అనుకుంటున్న స‌మ‌యంలో గుండెపోటుతో ఆయ‌న చ‌నిపోయి అభిమానుల‌కు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసారు. దాంతో త‌న భ‌ర్త కోస‌మైనా ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని అలేఖ్య ఆశ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.