G20 Summit నేపథ్యంలో కొండముచ్చు కటౌట్లు.. ఎందుకో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) ప్రగతి మైదాన్‌లో జీ20 సమ్మిట్ (g20 summit) జరగనుంది. వివిధ దేశాలకు చెందిన నేతలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు. సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జరగబోయే ఈ సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీలో భారీగా కొండముచ్చు ఫొటోలున్న కటౌట్లు ఏర్పాటుచేసారు. సాధారణంగా పెద్ద పెద్ద విదేశీ నేతలు మన ఇండియాకు వస్తున్నారంటే ఎంతో అందమైన వస్తువులను ఏర్పాటు చేస్తాం. అలాంటిది కొండముచ్చు ఫోటోలు ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారా?
దీనికి ఒక కారణం ఉంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో కొండముచ్చుల రచ్చ ఎక్కవైపోయిందట. ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. 2018 ఎన్నికల సమయంలో వీటి రచ్చ ఎక్కువగా ఉండేది. అధికారిక నివాసాల్లోకి కూడా వచ్చేస్తుండడంతో అధికారులు ఇలా కటౌట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రగతి మైదానానికి వెళ్లే అన్ని రోడ్ల మార్గాల్లో కొండముచ్చు కటౌట్లు పెట్టారు. దీని వల్ల ఉపయోగం ఏంటంటే.. కొండముచ్చు ఫోటోలను చూసి అక్కడ మరో కొండ ముచ్చు ఉందేమోనని అటు వైపు వెళ్లదట. అంతేకాదు.. దాదాపు 40 మంది వర్కర్లను పెట్టించి కొండముచ్చులా అరిచే ఏర్పాట్లు చేసారట. ఇలా చేస్తే అవి అక్కడి నుంచి పారిపోతాయట. ఈ ఐడియా ఈసారి ఎలా పనిచేస్తుందో చూడాలి. (g20 summit)