Lalu Prasad Yadav: ఇండియా అంటే ఢిల్లీ.. భార‌త్ అంటే బిహార్

ఇండియాను (india) భార‌త్ (bharat) అని మార్చాల‌ని చ‌ర్చ‌ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అస‌లు భార‌త్‌కి ఇండియాకి తేడా ఏంటో ఒకానొక సంద‌ర్భంలో వివ‌రించారు RJD అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ (lalu prasad yadav). ఆయ‌న బిహార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టి వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆయ‌న వేప పుల్ల‌తో ప‌ళ్లు తోముకుంటున్న‌ప్పుడు జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో.. మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వేప పుల్ల దొరికేదా స‌ర్ అని రిపోర్ట‌ర్ అడిగారు. ఇందుకు లాలూ స‌మాధానంగా.. లేదు. ఎందుకంటే ఢిల్లీ ఇండియా. బిహార్ భార‌త్. ఇలాంటివి భార‌త్‌లోనే దొరుకుతాయి అని ఆన్స‌ర్ ఇచ్చారు. (lalu prasad yadav)