Kumari Aunty: గుడివాడ‌లో కుమారి ఆంటీ ప్ర‌చారం!

Kumari Aunty campaigning in gudivada

Kumari Aunty: మీది మొత్తం వెయ్యి అయ్యింది. రెండు లివ‌ర్లు ఎక్స్‌ట్రా అనే ఒక్క మాట‌తో తెలుగు రాష్ట్రాల్లో ఫేమ‌స్ అయిపోయింది కుమారి. ఇప్పుడు అంద‌రూ ఆమెను ప్రేమ‌గా కుమారి ఆంటీ అని పిలుస్తున్నారు. ప‌లు సీరియ‌ళ్ల‌లోనూ న‌టిస్తున్నారు. సినిమా అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు రాజ‌కీయాల్లోకి కూడా కుమారి ఆంటీ ఎంట్రీ ఇచ్చేసిన‌ట్లున్నారు. త‌న స్వ‌స్థ‌లం అయిన గుడివాడ‌లో కుమారి ప్ర‌చారం చేస్తున్నారు. అయితే గుడివాడ నుంచి బ‌రిలో ఉన్న కొడాలి నాని కోసం కాదు.

తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్ధి వెలిగండ్ల రాము త‌ర‌ఫున కుమారి ఆంటీ ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. గ‌త 15 ఏళ్ల‌లో గుడివాడ‌లో అస‌లు అభివృద్ధే లేద‌ని అందుకే బ‌తుకు తెరువు కోసం తెలంగాణ‌లో ఫుడ్ స్టాల్ పెట్టుకోవాల్సి వచ్చింద‌ని తెలిపారు. ఈసారి ఎన్నిక‌ల్లో కూట‌మి గెలిచి గుడివాడ‌ను డెవ‌ల‌ప్ చేస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వెలిగండ్ల రామును మ‌హ‌ర్షి సినిమాలో మ‌హేష్ బాబుతో పోల్చిన కుమారి ఆంటీ.. రాము కూడా ఎన్నిక‌ల్లో గెలిచాక గుడివాడ‌కు మంచి చేస్తార‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.