షాదాబ్ హోటల్లో KTR సందడి

KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్‌లోని షాదాబ్ హోట‌ల్‌లో సంద‌డి చేసారు. ప్రోటోకాల్ లేకుండా స‌డెన్‌గా హోట‌ల్ వ‌ద్ద‌కు వ‌చ్చి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. దాంతో హోట‌ల్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్లు షాక‌య్యారు. ఆయ‌న‌తో స‌ర‌దాగా మాట్లాడి టిఫిన్ చేసారు. మ‌రికొందరు కేటీఆర్‌తో సెల్ఫీలు దిగారు. ఇటీవ‌ల కేటీఆర్ నిలోఫ‌ర్ కెఫెకు వెళ్లి అక్క‌డి క‌స్ట‌మ‌ర్ల‌తో స‌ర‌దాగా చాయ్ తాగారు.