KTR: ఇంకా మొదలుపెట్టలేదు.. KCR వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి
KTR: ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయి. BRS పార్టీకి కార్యకర్తలే కథానాయకులు. మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారు.. KCR అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండి. కాంగ్రెస్, BJP అక్రమ బంధం నల్గొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడింది..నల్గొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలుద్దాం అని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలతో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు.