KTR: KCRకి ఛాతీలో ఇన్ఫెక్షన్.. కోలుకుంటున్నారు
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR.. సీఎం KCR ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. కొన్ని రోజులుగా KCR వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని.. ఇప్పుడు ఆ ఫీవర్ తగ్గినప్పటికీ ఛాతిలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ సోకిందని ప్రస్తుతానికి కోలుకుంటున్నారని తెలిపారు. అనంతరం పాఠశాల పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీం గురించి మాట్లాడుతూ.. పిల్లలు దైవంతో సమానం అంటారని వారికి అన్నం పెడితే సాక్షాత్తు భగవంతుడికి సేవ చేసినట్లే అని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (telangana elections) ముందు కాంగ్రెస్ (congress) ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతూ.. 150 ఏళ్ల నాటి పార్టీ ఆల్రెడీ ప్రజల్లో వారెంటీ కోల్పోయిందని ఇక గ్యారెంటీలు ఇచ్చి ఏం లాభం అని సెటైర్ వేసారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ..(narendra modi) KCR BRS పార్టీని NDAలో విలీనం చేస్తారు అని ఆరోపించిన దానిపై మరోసారి స్పందిస్తూ.. ఆయన ఓట్ల కోసం ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత నీచానికి దిగజారుతారని అస్సలు ఊహించలేదని అన్నారు.