KTR: ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..వీడియో వైరల్
KTR: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈడీ అధికారులు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు చేసారు. ఈ నేపథ్యంలో కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. విషయం తెలీగానే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. ఎమ్మెల్యే హరీష్ రావు హుటాహుటిన కవిత ఇంటికి వెళ్లారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను KTR ప్రశ్నించారు. “” అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారు? సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావాలని శుక్రవారం వచ్చారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటే ఎలా? ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే ఎలా అరెస్ట్ చేస్తారు “” అంటూ KTR మండిపడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియో కాస్తా వైరల్‌గా మారింది.