KTR: ఆడ‌వాళ్ల‌పై అఘాయిత్యాలు.. కేంద్రానికి క‌న‌ప‌డ‌వా?

KTR: క‌ర్ణాట‌క ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌న్న (Prajwal Revanna) సెక్స్ స్కాండిల్ దేశ‌వ్యాప్తంగా దుమారం రేపుతోంది. దాదాపు 1000 వీడియోల వ‌ర‌కు ప్ర‌జ్వ‌ల్ పెన్ డ్రైవ్‌ల‌లో దాచుకుని వాటిని అడ్డుపెట్టుకుని ఇంట్లోని ప‌నివాళ్ల‌ను, బ‌య‌టి అమ్మాయిల‌ను వేధించాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

“” ప్ర‌జ్వ‌ల్ రేవ‌న్న విష‌యంలో నేనెంతో షాక్ అయ్యాను. అస‌లు ఇత‌న్ని దేశం ఎలా దాటించారు? అత‌న్ని త‌ప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయి ఉంటే, ఆరోపణలు పరిణామాలను ఎదుర్కోవడానికి అతన్ని తిరిగి భారతదేశానికి తీసుకురండి. మ‌ణిపూర్‌లో మ‌హిళ‌లు వేధింపుల‌కు గురైతే అక్క‌డ చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేసారు. బిల్కిస్ బానో కేసులోని నిందితుల‌ను వ‌దిలేసారు. రెజ్ల‌ర్లు బ్రిజ్ భూష‌ణ్‌పై వేసిన కేసును ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు రేవన్న అంశం “” అంటూ కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు కేటీఆర్.