KTR: ఈసారి సినిమా నేను చూపిస్తా

హైద‌రాబాద్‌లో అతి పొడ‌వైన స్టీల్ బ్రిడ్జ్‌ను (steel bridge) ప్రారంభించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. ఇది ద‌క్షిణ భార‌తంలోనే అతిపొడ‌వైన స్టీల్ బ్రిడ్జ్ అని తెలిపారు. ఈ సంద‌ర్భంగా KTR మాట్లాడుతూ..”” ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అందరం సినిమా చూసినోళ్ళమే, సంధ్యలో, సుదర్శన్‌లో, ఒడియాన్‌లో సినిమాలు చూస్తూ ట్రాఫిక్ లో ఇరుక్కునోల్లమే. ఆ కష్టాలు నాకు తెలుసు. కాకపోతే ఈసారి ప్ర‌తిప‌క్షాల‌కు సినిమా నేను చూపిస్తా “” అంటూ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేసారు KTR.