KTR: మూసీ నదిపై 55 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే

Hyderabad: మూసీ న‌దిపై ఎక్స్‌ప్రెస్ వే (express way on musi) నిర్మించ‌నున్న‌ట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR ప్ర‌క‌టించారు. 14 బ్రిడ్జిలు, 10 వేల కోట్లతో హైదరాబాద్ ఈస్ట్ నుండి వెస్ట్ వరకు 55 కిలోమీటర్ల మేర‌ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. అంతేకాదు.. మూసీ న‌ది నుంచి ఎలాంటి దుర్వాస‌లు రాకుండా చూడ‌టానికి కాస్త అందంగా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టనున్న‌ట్లు పేర్కొన్నారు. మూసీ బ్యూటిఫికేష‌న్ ఎప్పుడో జ‌ర‌గాల్సి ఉంది కానీ క‌రోనా వ‌ల్ల ఎక్క‌డి ప‌నులు అక్క‌డ ఆగిపోయాన‌ని, ఇప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫాస్ట్‌గా ప‌నులు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. దీని వ‌ల్ల హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు మ‌రింత త‌గ్గిపోతాయని అన్నారు. మూసీపై స్కై వే కూడా ఏర్పాటుచేసే యోచ‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.