KTR: BRS ఉండ‌గా BJP, కాంగ్రెస్‌ ఎందుకు దండ‌గ‌..!

Hyderabad: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు BRS ఉండ‌గా BJP, కాంగ్రెస్ (congress) ఎందుకు దండ‌గ అంటూ సెటైర్ వేసారు KTR. తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ ప‌దేళ్ల‌లో తెలంగాణ‌కు తాము చేసిన మంచిని చెప్పుకుంటూ సోష‌ల్ మీడియా ప్ర‌చారం మొదలుపెట్టేసారు. ఈ నేప‌థ్యంలో స‌ర‌దాగా ఓ ట్వీట్ పెట్టారు.

ITIR ప్రాజెక్టు ఇవ్వకున్నా..
దిగ్గజ IT కంపెనీలన్నీ తెచ్చుకున్నం

జాతీయ హోదా ఇవ్వకున్నా..
కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నం
పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తున్నం

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా..
“మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ”ని
సీఎం KCR గారి చేతుల మీదుగా
ఘనంగా ప్రారంభించుకున్నం

ఒక్క మాటలో చెప్పాలంటే..
ప్రజలకు ఎప్పుడూ అండగా BRS..!!
దేశానికి ఎప్పటికీ దండగ – BJP & కాంగ్రెస్ ..!!!