KTR: చంద్రబాబు ఎలా చక్రం తిప్పారో చూసారుగా.. కేసీఆర్ కూడా అదే అడిగారు
KTR: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో బొగ్గు గనులను వేలం వేయాలని ప్రతిపాదన తేవడంతో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు.
“” పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి ముందు కేసీఆర్ 16 ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రంలో నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటాం అని అడిగారు. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది ఏం చేస్తారు 16 సీట్లు వస్తే అని హేళన చేసారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అవే 16 ఎంపీ సీట్లతో కేంద్రంలో నిర్ణయాత్మకమైన పాత్రను వహిస్తున్నారు. ఆ 16 సీట్లతోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవెటీకరణ కాకుండా ఆపారు. ఆ 16 సీట్లు భారత రాష్ట్ర సమితికి ఇచ్చి ఉంటే ఈరోజు తెలంగాణలో పరిస్థితి వేరేలా ఉండేది. ఆ 16 సీట్లలో కాంగ్రెస్‌కు 8 భారతీయ జనతా పార్టీకి 8 ఇస్తే వాళ్లు ఈరోజు తెలంగాణ బొగ్గు గనులను బజార్‌లో వేలానికి పెట్టారు “” అని తెలిపారు.