KTR: హిందీ జాతీయ భాష కాదు.. జర్నలిస్ట్‌కి క్లాస్ పీకిన మంత్రి
Telangana Elections: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR వీలైనంత ఎక్కువగా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ప్రజలకు తమ ప్రభుత్వం ఎంత మంచి చేసిందో చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు లోకల్, నేషనల్ మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసారు.
అయితే ఇండియా టుడేకి చెందిన ఓ జర్నలిస్ట్ KTR ఆల్రెడీ మాట్లాడేసిన అంశం గురించే మళ్లీ ఇంగ్లీష్‌లో ప్రశ్నించారు. దీనికి KTR సమాధానమిస్తూ.. ఇప్పుడు తెలుగులో గొంతు చించుకుని చెప్పింది అదే కదా. సరే మీకోసం మళ్లీ చెప్తాను. ఇంగ్లీష్‌లో చెప్పమంటారా హిందీలో చెప్పమంటారా అని అడిగారు. దీనికి ఆ జర్నలిస్ట్ సమాధానం ఇస్తూ.. మన జాతీయ భాష హిందీ కాబట్టి హిందీలోనే చెప్పండి అన్నాడు. దాంతో KTRకి ఒళ్లుమండింది. హిందీ రాష్ట్ర భాష కాదు. “” మన దేశంలో ఎన్నో భాషలకు గుర్తింపు లభించింది. అందులో హిందీ ఒకటి. అంతేకానీ దానిని జాతీయ భాష అనకండి. ఇది మీ మైండ్ నుంచి ముందు తొలగించుకోండి “” అని క్లాస్ పీకారు.