Kavitha: న్యాయం మనవైపే ఉంది.. భయపడకు.. కవితకు కేటీఆర్ పరామర్శ
Kavitha: మూడు నెలలుగా ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. ఆమె సోదరుడు KTR ఈరోజు కలిసారు. కేటీఆర్‌ను చూడగానే కవిత కన్నీరుపెట్టుకున్నారు. నాన్న పిల్లలు ఎలా ఉన్నారని కవిత కేటీఆర్‌ను అడిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెలంగాణ ఎంపీ ఎన్నికలు జరిగిన తీరు గురించి కేటీఆర్ కవితతో చర్చించినట్లు సమాచారం. జైల్లో తనకున్న ఇబ్బందులను కవిత కేటీఆర్‌కు చెప్తుంటే కేటీఆర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయట. నువ్వేమీ భయపడకు.. న్యాయం మనవైపు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ ఆమెకు ధైర్యం చెప్పారు.