KTR: కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టింద‌ట‌..!

Telangana Elections: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR కామారెడ్డిలో నిర్వ‌హించిన ప్ర‌చార కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. సీఎం KCR… గ‌జ్వేల్‌తో (gajwel) పాటు కామారెడ్డిలోనూ (kamareddy) పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తండ్రి కోసం KTR ప్ర‌చారంలోకి దిగారు. ఈ సంద‌ర్భంగా KTR మాట్లాడుతూ.. ఆగ‌డు సినిమాలో మ‌హేష్ బాబు డైలాగ్ కొట్టారు.

డిక్కీ బ‌ల్సిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడకొట్టింద‌ట అని అన్నారు. ఈ డైలాగ్‌ను కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని (revanth reddy) ఉద్దేశిస్తూ అన్నారు. కామారెడ్డిలో రేవంత్ KCRపై పోటీకి దిగుతాన‌ని అన్నందుకు KTR ఈ డైలాగ్‌తో రేవంత్‌పై సెటైర్ వేసారు. రేవంత్ రెడ్డి కంటే ష‌బ్బీర్ అలీ కాస్త బెట‌ర్ అని అలాంటి ఆయ‌నే పోటీ చేయ‌లేక పారిపోతుంటే ఈ రేవంత్ వ‌చ్చి ఏం చేస్తాడ‌ని అన్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పార్టీని గెలిపిస్తే.. రాష్ట్రంలోనే నెంబ‌ర్ వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంగా కామారెడ్డిని KCR తీర్చిదిద్దుతార‌ని హామీ ఇచ్చారు. న‌వంబ‌ర్ 9న KCR నామినేషన్ వేసేందుకు కామారెడ్డికి రానున్న‌ట్లు వెల్ల‌డించారు.