Telangana Assembly: అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు..!

Hyderabad: ఈరోజు ప్రారంభమైన తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాల్లో (telangana assembly) ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. BJP ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) సీటు దగ్గరికి వెళ్లి మంత్రి KTR ఆప్యాయంగా పలకరించారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను ఆలింగనం చేసుకుని ప‌ది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డితోనూ (jagga reddy) KTR స‌ర‌దాగా మాట్లాడారు. ఏమ‌న్నా చిన్న‌పిల్లాడి మాదిరి టీష‌ర్ట్ వేసావ్ అని KTR జగ్గారెడ్డిని అడ‌గ్గా.. పిల్ల‌లే వేసుకుంటారా ష‌ర్టులు అని ఆయ‌న ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చారు.