KTR: కాంగ్రెస్‌ పాకిస్థాన్‌.. BJP ఇంగ్లాండ్‌.. మేం హిందుస్థాన్!

Telangana Elections: ప్ర‌స్తుతానికి త‌మ పార్టీ వ‌రల్డ్ క‌ప్ న‌డుస్తోంద‌ని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. న‌వంబర్ 30న సిక్స్‌లు బాదబోతున్నామ‌ని తెలిపారు. ఒక‌వేళ కాంగ్రెస్, BJPని ఏ దేశాల క్రికెట్ టీంతో పోలుస్తారు అని ప్ర‌శ్నించ‌గా.. కాంగ్రెస్‌ను పాకిస్థాన్‌తో.. BJPని ఇంగ్లాండ్‌తో పోల్చారు. అలా ఎందుకు అని ప్ర‌శ్నిస్తే.. ఈ రెండు పార్టీల్లో కాంగ్రెస్ లాంటి చెత్త పార్టీని.. పాకిస్థాన్ లాంటి చెత్త క్రికెట్ టీంని ఎక్క‌డా చూడ‌లేద‌ని అన్నారు.

కాంగ్రెస్‌తో పోలిస్తే భార‌తీయ జ‌న‌తా పార్టీ కాస్త బెట‌ర్ అని అన్నారు. 50 ఏళ్లు ఇచ్చినా కూడా ఏమీ చేయ‌లేని కాంగ్రెస్ ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చి ఏం చేస్తుంద‌ని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్, BJP ఇండియాకి ప‌ట్టిన వైర‌స్ లాంటివారని.. దేశానికి హైద‌రాబాద్ ఓ వ్యాక్సిన్ క్యాపిట‌ల్‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో కూడా ప్రతిపక్షాల ఇదే హంగామా చూసామ‌ని ఈసారి 2018 కంట ఎక్కువ సీట్లు BRS పార్టీకి వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు KTR.