KTR: తెలంగాణ ఎన్నిక‌ల‌పై క్లారిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై (telangana assembly elections) KTR కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు జ‌రుగుతాయ‌ని ఆ సమయంలోగా నోటిఫికేషన్ రాద‌నే అనుకుంటున్నామ‌ని అన్నారు. తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్ లేదా మేలో జరిగే అవ‌కాశం ఉంద‌ని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికల క్లారిటీ వచ్చి అవకాశం ఉంద‌ని తెలిపారు.