KTR: పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం

ktr calls revanth reddy howla cm

KTR: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో KCR ఆన‌వాళ్లు లేకుండా చేస్తాన‌ని అంటున్నాడ‌ని.. దాన‌ర్థం తెలంగాణ‌ను మ‌ళ్లీ ఆంధ్ర‌లో క‌లిపడ‌మే అని అన్నారు BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR. తెలంగాణ లేక‌పోతేనే కేసీఆర్‌ను మ‌ర్చిపోతార‌ని.. తెలంగాణ‌ను ఆంధ్ర‌లో క‌లిపితేనే కేసీఆర్‌ను ప్ర‌జ‌లు మ‌ర్చిపోతార‌ని కేటీఆర్ ఆన్నారు. పైన జుమ్లా పీఎంతో.. కింద హౌలా సీఎంతో తెలంగాణ ప్ర‌జ‌లు త‌ల్లడిల్లిపోతున్నార‌ని సెటైర్లు వేసారు.

కాంగ్రెస్‌కు తెలిసిన ఒకే ఒక్క విద్య కేసులు పెట్ట‌డం అని.. ఆ కేసుల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ‌కూడ‌దు అని అన్నారు. కేసులు పెడుతున్నార‌ని ప్ర‌శ్నించ‌డం బంద్ అయితే తెలంగాణ మూగ‌బోత‌ద‌ని KTR పిలుపునిచ్చారు. తెలంగాణ‌కు ఏం అన్యాయం జ‌రిగినా భార‌తీయ జ‌న‌తా పార్టీ మాట్లాడ‌ద‌ని.. పైన కాంగ్రెస్, BJP ఒక‌టే అని.. బ‌యటికి మాత్రం తిట్టుకుంటూ ఉంటార‌ని అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప‌రిస్థితి తంతే గారెల బుట్ట‌లో వ‌చ్చి ప‌డ్డ‌ట్లు అయ్యింద‌ని చుర‌క‌లంటించారు.