KTR: చంద్రబాబుతోనే పోరాడాం.. నువ్వో లెక్కా చిట్టి నాయుడు
KTR: తెలంగాణకు ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారని.. వారందరితో పోరాడామని అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. BRS నేత పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ నేత అరికెపూడి గాంధీల మధ్య జరిగిన రచ్చ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ఈరోజు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అనంతరం కౌశిక్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
“” ఇప్పుడు నేను అందరి ముందు చెప్తున్నా. రేవంత్ రెడ్డి లాంటి పనికిమాలిన సీఎంను నేనెక్కడా చూడలేదు. గతంలో ఎందరో సీనియర్ ముఖ్యమంత్రులతో పోరాడాం. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య వంటి వారితోనే పోరాడం. నువ్వు వారికన్నా చిన్న. మా భాషలో చెప్పాలంటే నువ్వో చిట్టినాయుడివి బుల్లబ్బాయ్వి. నీతో పోరాడం మాకు ఓ లెక్కా. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కాబట్టి ఎగిరిపడకు. నువ్వు అబద్ధాలు చెప్పి ఆరు హామీలు అంటూ అధికారంలోకి వచ్చావు.
ఆ 6 హామీలు నెరవేర్చే వరకు మేం వెంటాడుతూనే ఉంటాం. మా కౌశిక్ రెడ్డి అడిగిన దాంట్లో తప్పేముంది? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పోయిన పది మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజా క్షేత్రంలో మళ్లీ పోటీ చేసి గెలిపించుకో అని అడగడం తప్పా. నువ్వే అన్నావ్ కదా.. పార్టీ మారే నేతలను రాళ్లతో కొట్టాలి అని. మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి? హామీలు నెరవేర్చకుండా హైడ్రా అని మాట మారుస్తున్నావ్. నువ్వు హైడ్రాని ఎందుకు పాపులర్ చేస్తున్నావో ప్రజలకు తెలియాలి. మేం హైదరాబాద్‌ను ఇంత బాగా డెవలప్ చేసాం కాబట్టే వారు మమ్మల్ని కడుపునిండా ఆశీర్వదించి అన్ని సీట్లు మాకే వచ్చేలా చేసారు. హైదరాబాద్ వాళ్లు కాంగ్రెస్‌కు ఒక్క ఓటు కూడా వేయలేదు కాబట్టే వారిపై పగ తీర్చుకునేందుకు ఈ హైడ్రా డ్రామాలు ఆడుతున్నావ్.
ఈ సందర్భంగా నేను అరికెపూడి గాంధీని ఒక మాట అడగాలని అనుకుంటున్నా. ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి పోటీ చేస్తూ కేసీఆర్, కేటీఆర్ పది వేల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్‌ను డెవలప్ చేసారు అని చెప్పి వారి చేత ఓట్లు వేయించుకున్నావ్. మరి ఇప్పుడెందుకు కాంగ్రెస్‌కు పోయినావ్. ఓట్ల కోసం మా పార్టీ చేసిన మంచి పనులు చెప్పుకుని గెలిచాక వేరే పార్టీకి జంప్ అయినావ్. నువ్వేం రాజకీయా నాయకుడివయ్యా “” అంటూ రెచ్చిపోయారు కేటీఆర్.